మన ఇంటి పేరు గడ్డమణుగు అని ఎందుకు ఒచ్చింది?

30 May 2011

అసలు మన ఇంటి పేరు గడ్డమణుగు అని ఎందుకు ఒచ్చింది?
ఎవరు పెట్టారు? 
ఎవరి తరం నుండి ఈ ఇంటి పేరు ఒచ్చింది?

ఇలాంటి ప్రశ్నలు బోలెడు ఒచ్చేవి నాకు చిన్నప్పుడు... మొత్తానికైతే అసలు ఈ ఇంటి పేరుకి వెనుక ఉన్న కథ ఏంటో తెల్సుకున్నాను.... అదేంటో మీరు కూడా తెల్సుకోవాలి, ఎందుకంటే మన ఇంటి పేరు చరిత్రని మనం తెల్సుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది... 
ఏమంటారు......................?

ఇప్పుడు అసలు చరిత్రలోకి ఒద్దాం.....!

అన్నపురాజు, కూనపురాజు అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారట! 
వారిద్దరూ ఒకరోజు పొలం లో ఉండగా వారి పొలం లో ఏదో "గడ్డ" దొరికిందట.. (గడ్డ అంటే దుంప అని అర్ధం..! పొలాల్లో చిలకడ దుంపలు,ఆలుగడ్డలు, అల మొత్తానికి ఏవో పంటలు వేసారట! ఆ పంటలో ఒక పెద్ద దుంప బయట పడిందట.) 
ఆ గడ్డని తూచి చూస్తే "మణుగు" బరువు తూగిందట..(మణుగు అనేది ఆ కాలం నాటి తూనిక కొలమానం,ఇప్పటి కే.జి, అర కే.జి. ల లాగా......).

ఇక అప్పటి నుండి జనం ఎప్పుడు ఈ అన్నదమ్ముల గురించి మాట్లాడుకోవాల్సి ఒచ్చినా "అదిగో ఆ మణుగు బరువున్న గడ్డ దొరికిందే, వాళ్ళు...", "మణుగు గడ్డ దొరికినోల్లు..", "మణుగంత గడ్డ ఒచ్చిందే వాళ్ళు...","మణుగు గడ్దోల్లు..." "ఎహేయ్...ఆ గడ్డ...,మణుగోల్లు..." ఇలా సంభోదిన్చుకుంటూ చివరికి ఆ గడ్డమణుగు వాళ్ళు అని పిలవటం మొదలు పెట్టేసారట... 
మన వాళ్ళు కూడా దానికే అలవాటు పడిపోయి ఉన్న అసలు ఇంటి పేరు ని కాస్తా మరిచిపోయారు... ఇంకేముంది ఎక్కడైనా ఇంటిపేరు చెప్పాల్సి ఒచ్చినప్పుడు అసలు ఇంటి పేరు గుర్తులేక ఈ "గడ్డమణుగు" నే ఇంటిపేరు గా చెప్పటం మొదలు పెట్టారు...
ఈ విధంగా మన ఇంటి పేరు "గడ్డమణుగు" గా స్థిరపడిపోయింది.

కాబట్టి ఇప్పటి వరకు మనకి తెలిసిన చరిత్రల ప్రకారం " అన్నపురాజు & కూనపురాజు" గార్లే మన "గడ్డమణుగు" వంశానికి మూలపురుషులు..

కాని అసలు వారిద్దరి తల్లితండ్రులు ఎవరు? అంతకు ముందు మన ఇంటి పేరు ఏమిటి? అనేవి మాత్రం తెలియదు.